ప్రపంచ ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 16 బిలియన్ (1,600 కోట్లు) యూజర్ అకౌంట్ల లాగిన్ వివరాలు, యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి చిక్కాయి. సైబర్ భద్రతా నిపుణులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది ప్రపంచ జనాభాలోని ప్రతి వ్యక్తికి ఒకటి లేదా రెండు ఖాతాల డేటా లీక్ అయినంత ప్రమాదకరమని అంచనా వేస్తున్నారు. ఈ డేటా లీక్ ద్వారా జీమెయిల్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, పేపాల్ వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ల వివరాలు కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాకింగ్ ఎలా జరిగింది? సాధారణంగా యూజర్లు వివిధ వెబ్‌సైట్‌లలో సైన్‌అప్ అయ్యేటప్పుడు ఇచ్చే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఫిషింగ్ వెబ్‌సైట్‌లు, మాల్‌వేర్ లేదా డేటాబేస్ బ్రీచ్‌ల ద్వారా హ్యాకర్లు దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా డీప్ వెబ్ , డార్క్ వెబ్‌లో ఈ దొంగిలించిన డేటాను భారీగా అమ్ముతున్నట్లు సమాచారం. కొన్ని హ్యాకర్ల గ్రూపులు ఈ డేటాను సేకరించి URL లింకుల ద్వారా పాస్‌వర్డ్ డంప్‌లను విక్రయిస్తున్నారని తేలింది.ఈ డేటా లీక్ వల్ల కలిగే ప్రమాదాలు: హ్యాకర్లు ఈ డేటాతో ఇతరుల పేరుతో ఖాతాలు తెరవవచ్చు లేదా నకిలీ లావాదేవీలు చేయవచ్చు. బ్యాంకింగ్ వివరాలు లభిస్తే ఖాతాల నుండి నిధులు దోచుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేయడం, నకిలీ ఖాతాలు సృష్టించడం జరగవచ్చు. కంపెనీల అధికారిక ఖాతాలు హ్యాక్ చేసి వ్యాపార రహస్యాలు దొంగిలించవచ్చు. ఈ భారీ డేటా లీక్ నేపథ్యంలో, సైబర్ భద్రతా నిపుణులు యూజర్లకు కొన్ని కీలక సూచనలు చేశారు: మీ అన్ని ముఖ్యమైన ఖాతాలకు కొత్త, కఠినమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేయండి. '123456', 'password', 'qwerty' వంటి సులభమైన పాస్‌వర్డ్‌లను వాడటం మానుకోండి. ప్రతి వెబ్‌సైట్‌కు వేరే పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. ఒకే పాస్‌వర్డ్‌ను అన్ని ఖాతాలకు వాడటం అత్యంత ప్రమాదకరం. గూగుల్ అథెంటికేటర్ లేదా SMS OTPలను అన్ని ఖాతాలకు ఎనేబుల్ చేసుకోండి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్‌లు, ఈమెయిల్‌లు ఓపెన్ చేయవద్దు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.వంటి పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించడం సురక్షితం. కంపెనీలకు అవసరమైన జాగ్రత్తలు: సర్వర్ భద్రతను పటిష్టం చేయాలి. డేటా ఎన్‌క్రిప్షన్ తప్పనిసరి చేయాలి. రెగ్యులర్‌గా సెక్యూరిటీ ఆడిట్‌లు నిర్వహించాలి. పరిశీలన లేకపోతే భారీ GDPR, DPA జరిమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రతి యూజర్‌కు ఒక హెచ్చరిక. సైబర్ సెక్యూరిటీని తక్కువ అంచనా వేయకూడదు. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి 3-4 నెలలకు పాస్‌వర్డ్‌లు మార్చడం, 2FA వాడటం, అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు తప్పనిసరి. ఇంటర్నెట్ వాడకానికి ముందు సైబర్ హైజీన్ అనుసరించకపోతే, అది పెద్ద నష్టాలకు దారితీస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa