భీమవరంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కాలేజీ బస్సులో వెళుతున్న ఓ విద్యార్థిపై యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం యువకులు నడిరోడ్డుపై వెకిలి చేష్టలు.. డ్యాన్సులు చేస్తూ దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం భీమవరంలో జరిగింది. భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసిన ఆగడాలకు అంతులేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి బస్తీకి వచ్చి తనను ఎందుకు కొట్టారని ప్రశ్నించాడు. దీంతో ఆకతాయిలందరూ ఆ విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి చేసి.. దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. తర్వాత ఆకతాయిలు మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa