ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రయాణికులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 01:16 PM

గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది. (07448) చర్లపల్లి - కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు జూలై 6 నుంచి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa