ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్యాన్ని ప్రశంసించిన అమెరికా

international |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 05:38 PM

ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లలో ఉన్న మూడు ఇరాన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు జరిపిన అనంతరం బీ-2 బాంబర్లు మిస్సోరిలోని వైట్‌మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా తిరిగి వచ్చిన వీడియోను వైట్‌హౌస్ సోమవారం విడుదల చేసింది. అమెరికా సైన్యాన్ని 'ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప స్వేచ్ఛా శక్తి' అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం అభివర్ణించింది."ఇరాన్ దాడి అనంతరం బీ-2 బాంబర్లు మిస్సోరిలోని వైట్‌మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా చేరుకున్నాయి. దేవుడు అమెరికా సైన్యాన్ని ఆశీర్వదించాలి. ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప స్వేచ్ఛా శక్తి ఇదే" అని వైట్‌హౌస్ పేర్కొంది. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ఫుటేజీలో అమెరికా అత్యంత అధునాతన వ్యూహాత్మక ఆయుధమైన బీ-2 బాంబర్ విమానం అమెరికా వైమానిక స్థావరంపై ఎగురుతూ, ల్యాండ్ అవడం చూడొచ్చు. పెంటగాన్ అధికారిక తక్షణ ప్రతిస్పందన బృందం కూడా ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ, "వెల్‌కమ్ హోమ్ బాయ్స్" అని వ్యాఖ్యానించింది.ఇక‌, నిన్న‌ 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' పేరుతో ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుంది. ఈ దాడులతో టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని అమెరికా ప్రకటించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగుతుందనే భయాలు వ్యాపించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa