విశాఖ ఎక్స్‌ప్రెస్ లో దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకుని.. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోరికి పాల్పడటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని పలు కోచ్‌లను లక్ష్యంగా చేసుకొని చోరీకి యత్నించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, ఈ దుండగులు రైలులోకి చొరబడి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa