AP: ఆగస్టులోగా మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ గురువారం వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు కృషి, పట్టుదల ముఖ్యమని, నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారిలో నడవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. కష్టపడి పని చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ తీసుకున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa