AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పీ4 బాధ్యతలు అప్పగించింది. పీ4 మార్గదర్శులు, బంగారు కుటుంబాల మధ్య సమన్వయం కల్పించే విధానాన్ని అమలు చేయనుంది. ఈ క్రమంలో ప్రతి సచివాలయ ఉద్యోగికి సగటున మూడు క్లస్టర్లు కేటాయించారు. అదేవిధంగా, మార్గదర్శులు, బంగారు కుటుంబాల సమన్వయాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa