ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో శుక్రవారం కూడా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా, ఘటనాస్థలంలో 303 రైఫిల్‌తోపాటు ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. గరియాబంద్‌లో గురువారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa