జీఎస్టీ సంస్కరణలు అమలు చేసినప్పటి నుంచి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కి 3వేలకుపైగా జీఎస్టీ సంబంధిత ఫిర్యాదులు వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు. ఈ ఫిర్యాదులను సీబీఐసీకి పంపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించకుండా, తప్పుదారి పట్టించే డిస్కౌంటింగ్ పద్ధతులతో మోసగిస్తున్న సందర్భాలను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa