ప్రేమించిన బాలికను దారుణంగా హతమార్చిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం అర్ధరాత్రి అశోక్ ఆ బాలికను పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa