ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఓకేలో పాక్ సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 08:17 PM

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించగా, తాజా మరో ఇద్దరు మరణించారు. బాఘ్, ముజఫరాబాద్, మిర్‌పుర్ ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసనల్లో, పాకిస్థాన్ ప్రభుత్వం తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని, 70 ఏళ్లకుపైగా ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మౌలిక సంస్కరణలు, 38 డిమాండ్ల అమలు కోరుతూ 'షటర్-డౌన్.. వీల్-జామ్' పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa