శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మండలం నందమూరినగర్ వద్ద బలవంతపు భూ సేకరణను నిరసిస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ 8 గ్రామాల రైతులు సోమవారం ప్రధాన రహదారిపై భైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుందో నిర్ణయించక ముందే బలవంతంగా భూ సేకరణ ఎలా చేస్తారని రెవెన్యూ అధికారులను అన్నదాతలు నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa