తమిళనాడు ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ప్రైవేట్ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఈరోడ్‌కు కుర్లా ఎక్స్‌ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటినప్పుడు, ఓ వ్యక్తి ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాక్‌కు గురైన మహిళ కేకలు వేయగా, తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సేలం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ చిత్తూర్‌కు చెందిన 45 ఏళ్ల శంకర్‌గా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa