యూట్యూబ్‌లో ఇషా ఫౌండేషన్ పేరుతో, సద్గురు అరెస్ట్ వంటి ఫేక్ AI డీప్‌ఫేక్ ప్రకటనలు పెరగడంతో ఢిల్లీ హైకోర్టు కఠినంగా స్పందించింది. గూగుల్ వెంటనే ఈ నకిలీ యాడ్స్‌ను ఆపాలని అక్టోబర్ 14న జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఆదేశాలు జారీ చేశారు. ఇషా ఫౌండేషన్ – గూగుల్ కలిసి శాశ్వత పరిష్కారం కనుగొని, ఫిర్యాదు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సద్గురును అరెస్టు చేసినట్లు చూపించే తప్పుడు ప్రకటనలను వెంటనే ఆపాలని కోర్టు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa