ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరిదితో కాపురం చేయాలని భర్త ఒత్తిడి...వివాహిత సెల్ఫీ వీడియో సూసైడ్

Crime |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:55 PM

అదనపు కట్నం కోసం మహిళను వేధించిన భర్త, అత్తమామలు, వారి బంధువులు అతంటితో ఆగకుండా మరిదితో కాపురం చేయాలని బలవంతం చేశారు. అత్తింటి ఆరళ్లకు తాళలేక ఆ ఇల్లాలు తాను అనుభవించిన నరకాన్ని సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడింది. కట్టుకున్నవాడు, అత్తమామలు, మరిది తనను ఎలా వేధించిందీ ఆమె అందులో వివరించింది. వరకట్న పిశాచికి వివాహిత బలైపోయిన ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు సమీపంలోని విశ్వేశ్వరయ్య పిక్ అప్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసి, ఆమె డ్యామ్‌లో దూకి ప్రాణాలు కోల్పోయింది.


బాధితురాలిని దొడ్డబళ్లాపుర తాలూకా సోతెనహళ్లికి చెందిన పుష్ప (23)గా గుర్తించారు. తన ఆత్మహత్యకు అత్తింటి వాళ్లే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. తపసీహళ్లికి చెందిన వేణుతో పుష్పకు దాదాపు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానులను పుట్టింటివాళ్లు ముట్టజెప్పారు. అయితే, కొద్ది రోజుల్లోనే అత్తింటివాళ్ల నిజస్వరూపం బయటపడింది. అదనపు కట్నం తీసుకురావాలని, పెళ్లి సమయంలో ఇచ్చిన తనకు ఇచ్చిన స్థలం గురించి వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని బాధితురాలు సెల్ఫీ వీడియోలో వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది.


రెండో పెళ్లి చేసుకోవాలనే కోరికతో భర్త తనను మానసికంగా కూడా వేధింపులకు గురిచేసినట్టు వాపోయింది. తనపై హత్యాయత్నం కూడా చేశారని తెలిపింది. ఓసారి ఆహారంలో విషం కలిపి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించింది. అంతేకాదు, మరిదితోనూ కాపురం చేయాలని బలవంతం చేశారని సంచలన ఆరోపణలు చేసింది. అందుకు తాను ఒప్పుకోలేదని శారీరకంగా హింసించారని తెలిపింది. దాదాపు 8 నిమిషాల వీడియోలో తాను అత్తింట్లో ఏలాంటి నరకం అనుభవించానో బాధితురాలు కన్నీళ్లు పెట్టింది.


మూడు రోజులుగా కనిపించకుండా పోయిన పుష్ప.. సోమవారం డ్యామ్‌లో శవమై తేలింది. వీడియో తీసి పుష్ప ఆత్మహత్య చేసుకుంది. భర్త వేణు, అత్తమామలు భారతి గోవిందప్ప, మరిది నారాయణస్వామి, బంధవులు ముత్తేగౌడ, పల్లవిలు వేధింపులే తనకు చావుకు కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. అంతేకాదు, తన శవాన్ని అత్తింటి ముందే పాతిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్త మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa