శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందారు.మృతుల్లో 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. భక్తుల రద్దీతో రెయిలింగ్ ఊడిపడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరిపై ఒకరూ పడటంతో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa