శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 9 మంది భక్తుల మృతదేహాల పోస్టుమార్టం పూర్తయింది. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు మృతదేహాలను తరలించారు. ఈ ఘటనలో బాలుడు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa