కరెక్ట్‌గా తొమ్మిదేళ్ల క్రితం.. నవంబర్ 8, 2016న రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం లక్ష్యాలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అమలులో తీవ్ర ఇబ్బందులు, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రిజర్వ్ బ్యాంక్ నివేదికల ప్రకారం, నల్లధనం పెద్దగా బయటపడలేదు. పైగా జీడీపీ పతనమైంది. ఆర్థికవేత్తలు దీన్ని 'ఆర్థిక ఉగ్రవాదం'గా అభివర్ణింస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa