AP: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సృజన్ ఆత్మహత్యపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్‌లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కొందరు అనుకుంటున్నారు. అలాగే ఓ యువతితో సృజన్ స్నేహంగా ఉండటం, అదే కాలేజీలో చదువుతున్న ఆమె అన్నదమ్ములు సృజన్‌ను బెదిరించడం, కొట్టడం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa