ఫరీదాబాద్ ఉగ్రవాద నెట్వర్క్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మాడ్యూల్ గత ఏడాది నుంచి ఒక సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తోందని, దిల్లీ పేలుడు కేసు నిందితుడు డా.ఉమర్ నబీ దీని కోసం ప్రయత్నించారని ఓ అధికారి వెల్లడించారు. అరెస్టయిన నిందితుల విచారణలో, ఉమర్ తమ కార్యకలాపాలకు ఆత్మాహుతి బాంబర్ అవసరమని పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో డా.ఆదిల్, డా.ముజమ్మిల్ గనాయీతో పాటు జాసిర్ ఎలియాస్ 'డానిష్'ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa