ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి మీదుగా బుల్లెట్ రైలు ఏర్పాటుకి ప్రణాళికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 02:03 PM

చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు ఖరారు చేసి, సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికకు సూత్రప్రాయ ఆమోదం లభిస్తే, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.తొలుత చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్‌కు ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మీదుగా ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం రైల్వేకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మార్గంలో మార్పులు చేసి, తుది నివేదికను సమర్పించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం ఒక్క తమిళనాడులోనే 223.44 హెక్టార్ల భూమి అవసరమని అక్కడి ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ 'రైట్స్' నివేదిక ఇచ్చింది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే 778 కిలోమీటర్ల దూరంలోని చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం 12 గంటలుగా ఉన్న ప్రయాణం కేవలం 2 గంటల 20 నిమిషాలకు పరిమితం అవుతుందని అధికారులు చెబుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa