ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడిశంకు చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం...ఎలా తీసుకోవాలి

Recipes |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 10:41 PM

చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో చల్లని పొడి గాలుల కారణంగా అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇక, ముక్కుకు పడిశం పట్టిదంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమంటారు.


అయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల్ని తగ్గించడానికి హాట్ చికెన్ మిరియాల రసం మంచి ఆప్షన్. నల్ల మిరియాలు, పసుపు, వెల్లుల్లి, ఇంట్లో తయారుచేసిన మసాల దినుసులతో తయారు చేసిన ఈ రసం.. రుచికరమైన రుచిని ఇవ్వడమే కాకుండా.. సీజనల్ సమస్యల్ని తరిమికొడుతుంది.


ఈ చికెన్ పెప్పర్ రసం జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటి సమస్యలను తక్షణమే తొలగిస్తుంది. శీతాకాలంలో శరీరానికి విశ్రాంతినిస్తుంది. దీని రెసిపీని కార్తీకేయన్ సెల్వరాజ్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.


చికెన్ మిరియాల రసం ఎందుకు మంచి ఆప్షన్?


చికెన్ మిరియాల రసంలో గ్లూకోసమైన్, కార్నోసిన్, కొల్లాజెన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంతేకాకుండా ఛాతీలో పేరుకుపోయిన కఫంను తగ్గించడంలో సాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉడికించినప్పుడు చికెన్ ఎముకల నుంచి విడుదలయ్యే కొల్లాజెన్ శరీరానికి విశ్రాంతినిస్తుంది. అదే సమయంలో నల్ల మిరియాలు ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. జలుబు తగ్గించడంలో ప్రభావవంంతగా ఉంటుంది.


కావాల్సిన పదార్థాలు


మసాలా పేస్ట్ కోసం:


1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు


2 టీస్పూన్ ధనియాలు


1 టీస్పూన్ సోంపు గింజలు


2 ఎండు మిర్చి


1/4 టీస్పూన్ జీలకర్ర


1 రెమ్మ కరివేపాకు


2 టమోటాలు


6 వెల్లుల్లి రెబ్బలు


చికెన్ వండటానికి:


500 గ్రాముల బోన్ ఇన్ చికెన్


3/4 టీ స్పూన్ పసుపు


3/4 టీ స్పూన్ ఉప్పు


3 కప్పుల నీరు


ఇతర పదార్థాలు


2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె


1/4 టీస్పూన్ ఆవాలు


1/4 టీస్పూన్ జీలకర్ర


1 రెమ్మ కరివేపాకు


1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు


1 కప్పు కొబ్బరి పాలు


3 రెమ్మలు కొత్తిమీర, సన్నగా తరిగినవి


చికెన్ మిరియాల రసం తయారీ విధానం


తయారీ విధానం


తయారీ విధానం 


మసాలా పేస్ట్ ఇలా రెడీ చేసుకోండి


అన్ని మసాలా దినుసుల్ని పాన్‌లో తక్కువ వేడి మీద గోల్డెన్ రంగులోకి వచ్చి సువాసన వచ్చే వరకు వేయించండి. వాటిని మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తరువాత, టమోటాలు, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపండి.


చికెన్ మిరియాల రసం ఎలా చేయాలి?


ఆ తర్వాత బోన్-ఇన్ చికెన్‌ను ప్రెజర్ కుక్కర్‌లో ఉంచండి. పసుపు, ఉప్పుతో పాటు సిద్ధం చేసిన మసాలా పేస్ట్ జోడించండి. మిక్సర్ జార్‌లో కొంచెం నీరు ప్రెజర్ కుక్కర్‌లో పోయాలి. సుమారు 3 కప్పుల నీరు వేసి 20 నిమిషాలు తక్కువ వేడి మీద ఉడికించాలి.


ప్రెజర్ తగ్గిన తర్వాత, చికెన్‌ను తీసివేసి, ముక్కలుగా చేసి, ఎముకల్ని వేరు చేయండి. ఆ తర్వాత ఒక పాన్‌లో నువ్వుల నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలపండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.


చికెన్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. ఉడికించిన చికెన్ స్టాక్, కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. చివరగా కొత్తిమీర వేసి కాసేపు ఉడికించాలి. ఇంకేముంది పడిశాన్ని వదిలించే చికెన్ మిరియాల రసం రెడీ అయినట్టే.


ఎలా తీసుకోవాలి?


వేడి వేడిగా చికెన్ మిరియాల రసాన్ని తాగండి. ఇలా సూప్ తాగడం వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. కావాలనుకుంటే మీరు అన్నంతో కూడా చికెన్ మిరియాల రసాన్ని తీసుకోవచ్చు. ఇది శరీరానికి తక్షణమే వేడి ఇస్తుంది. దీన్ని శీతాకాలంలో తప్పక ట్రై చేయండి. రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa