ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను మంగళవారం ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ ప్రభుత్వాధినేతగా మోదీ చరిత్ర సృష్టించారు. భారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa