ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాకు BCCI రూ.131 కోట్ల భారీ నజరానా

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 12:22 PM

భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. టీమిండియాకు భారీ నజరానాను ప్రకటించింది. ఏకంగా రూ.131 కోట్ల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. T20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచినందుకు గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది.ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది, సెలెక్టర్లందరికీ కలిపి రూ. 131 కోట్లు పంపిణీ చేయనున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని అందజేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. కాగా, 2024 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియా గెల్చిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు అప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ఇక, 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సూర్యకుమార్ సేనకు బీసీసీఐ రూ.131 కోట్ల నజరానా ప్రకటించింది. 2024  కంటే ఈసారి రూ. 6 కోట్లు అధికంగా నజరానాను పెంచింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. 2026, మార్చి 8న గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‎ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‎లో రాణించి ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఓవరాల్‎గా మూడుసార్లు (2007, 2024, 2026) టీ20 వరల్డ్ కప్‎ను టీమిండియా ముద్దాడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa