ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500 శాతం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఈ పరిణామాలపై ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ చర్యల ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా యోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa