భారత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టెక్నో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి సరిపోయేలా, తక్కువ ధరలో నమ్మకమైన స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ Tecno Spark Go 3ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను రూ. 8,999గా నిర్ణయించగా, ఇందులో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌ను అందిస్తోంది. ఇప్పటికే లోకల్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండగా, జనవరి 23 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.టెక్నో Spark Go 3లో 6.74 అంగుళాల HD+ IPS డిస్ప్లే ఉంది. దీనికి 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఈ ధర సెగ్మెంట్లో 120Hz స్క్రీన్ లభించడం విశేషం కాగా, దీని వల్ల స్క్రోలింగ్, యాప్‌ల వినియోగం మరింత స్మూత్‌గా ఉంటుంది. అదనంగా ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. దీని వల్ల దుమ్ము, నీటి చల్లుళ్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే 1.2 మీటర్ల ఎత్తు నుంచి పడినా ఫోన్‌కు పెద్దగా నష్టం కలగదని టెక్నో తెలిపింది.పర్ఫార్మెన్స్ కోసం ఇందులో Unisoc T7250 ఆక్సా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 1.8GHz వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఫోన్లో 4GB LPDDR4x ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. సాధారణ రోజువారీ వినియోగానికి ఇవి సరిపడే స్పెసిఫికేషన్లని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ను నాలుగు సంవత్సరాల పాటు స్మూత్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా డిజైన్ చేశామని టెక్నో వెల్లడించింది. సాఫ్ట్వేర్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో టెక్నోకు చెందిన Ella Voice Assistantను కూడా అందించారు.కెమెరా విభాగంలో టెక్నో Spark Go 3 వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు డ్యూయల్ LED ఫ్లాష్‌ను అందించారు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడుతుంది. కెమెరా యాప్‌లో AI Cam, Super Night, Portrait, Vlog, Pro వంటి పలు మోడ్లు ఉన్నాయి. ప్రత్యేక ఫీచర్‌గా, నెట్వర్క్ లేకుండానే రెండు టెక్నో ఫోన్లు 1.5 కిలోమీటర్ల దూరం వరకు కాల్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఇందులో అందించారు.బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 4G LTE, Wi-Fi, GPS, USB Type-C, డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టెక్నో Spark Go 3 టిటానియం గ్రే, ఇంక్ బ్లాక్, గెలాక్సీ బ్లూ, ఔరోరా పర్పుల్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. మొత్తం మీద, తక్కువ బడ్జెట్లో మంచి డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, సరైన పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారులకు Tecno Spark Go 3 ఒక వాల్యూ-ఫర్-మనీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa