ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దినచర్య, వ్యక్తిత్వం గురించి ఆయన భార్య నారా భువనేశ్వరి వివరించారు. చంద్రబాబు ఉదయం 4 గంటలకు లేచి వ్యాయామం చేస్తారని, సమయానికి ఆహారం తీసుకుంటారని తెలిపారు. సీఎం చంద్రబాబు తన ఆహారపు అలవాట్లను మార్చుకుని, అన్నం తగ్గించి, కూరగాయలు, ప్రోటీన్, పండ్లు, మిల్లెట్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడటానికి, షుగర్ వంటి సమస్యలను నివారించడానికి ఈ మార్పులు చేసుకున్నానని, ప్రజలు కూడా ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని పాటించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa