క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ కప్ 2026 అధికారిక గీతం విడుదలైంది. "ఫీల్ ద థ్రిల్" పేరుతో వచ్చిన ఈ పాటను ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, నిర్మించి, స్వయంగా ఆలపించారు. జనవరి 30 ఈ పాటను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి మరింత ఉత్సాహాన్ని నింపేలా ఈ గీతాన్ని రూపొందించారు. ఈ పాటకు హీసెన్బర్గ్ ఆంగ్లంలో సాహిత్యం అందించగా, రకీబ్ ఆలం హిందీలో రాశారు. టోర్నీకి ఇది "ప్రధాన సంగీత స్పందన" (సోనిక్ హార్ట్‌బీట్)గా నిలుస్తుందని ఐసీసీ అభివర్ణించింది. ప్రస్తుతం ఈ పాట యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి అన్ని ప్రధాన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa