భారత్–అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై అమెరికా రిటైర్డ్ కల్నల్, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్ మక్‌గ్రెగర్ స్పందించారు. వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా చెప్పిన ప్రతిదానికీ భారత్ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశమూ ఇతర దేశాలతో చర్చలు జరపదన్నారు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్ ఆలోచన మూర్ఖపు మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అమెరికా ‘మాతోనే ఉండాలి లేదా వ్యతిరేకించాలి’ అనే విధానాన్ని పాటిస్తోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa