ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Moto Edge 50 Ultra 5G: ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్‌ సేల్! రూ.22,000+ తగ్గింపు

Technology |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 09:22 PM

ఫెస్టివల్‌ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్స్ మిస్‌ అయ్యాయా? రిపబ్లిక్‌ సేల్ కూడా పక్కన పెట్టేసారా? అయితే ఇప్పటికీ మంచి డిస్కౌంట్‌లో లేటెస్ట్ ఫోన్‌ ఎలా కొనాలి అని ఆలోచిస్తుంటే… ఈ డీల్‌ మీకోసమే.స్పెషల్ డిస్కౌంట్‌తో రూ.45,000 లోపు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. అదే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G (Motorola Edge 50 Ultra 5G). ఇది ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ తో లభిస్తోంది. ఎక్కువ ధర చెల్లించకుండానే టాప్-ఎండ్ ఫీచర్లను కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌. ఇప్పుడు ఈ మొబైల్‌ ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు చూద్దాం.మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G అసలు ధర రూ.64,999. ఇది ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.44,999కి లిస్ట్‌ అయింది. అంటే రూ.20,000 వరకు భారీ తగ్గింపు అందుతోంది. అదనంగా SBI లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ కూడా అందుతుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌తో ఫోన్‌ను రూ.42,499కి కొనుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్ ఈ డివైజ్‌పై ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.41,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ విలువ మీ ఫోన్ మోడల్, దాని కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.మంత్లీ రీపేమెంట్స్‌ ఇష్టపడే వారికి 36 నెలల వరకు నెలకు రూ.1,758 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.
*ఫీచర్లు & స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది స్మూత్ స్క్రోలింగ్, ప్రీమియం వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. స్క్రీన్ 2,500 నిట్స్‌ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది, అందువల్ల డే లైట్‌లో కూడా స్పష్టంగా చూడవచ్చు.12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఫోన్‌ను భారీ మల్టీటాస్కింగ్, గేమింగ్, లాంగ్-టర్మ్ యూజ్‌కి అనుకూలంగా చేస్తుంది.ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉండటం వలన ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి ఫీచర్ చాలా అరుదుగా ఉంటాయి.
*కెమెరా సెటప్ : కెమెరాల విషయానికి వస్తే, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరియు 64MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.రెండు విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి: రూ.22,000 వరకు తగ్గింపు, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్‌, ఫాస్ట్ ఛార్జింగ్, వెర్సటైల్ కెమెరా సెటప్‌తో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5Gకి ఇంత మంచి విలువ అందించే ఇతర ఫోన్లు చాలా తక్కువ. రూ.45,000 లోపు ఫోన్లలో ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చాలా అరుదుగా లభిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa