ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైల్లో కూడా లైంగికశక్తి పెంచే మందుల కోసం పరితపించిన ఎప్‌స్టీన్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 10:08 PM

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన అత్యంత రహస్య పత్రాల్లో ఎప్‌స్టీన్ వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన షాకింగ్ వివరాలు వెల్లడి అయ్యాయి. దశాబ్ద కాలంగా అతను ఎదుర్కొంటున్న శారీరక ఇబ్బందులు, లైంగిక వ్యాధులు, అతని వింత కోరికల చుట్టూ ఈ నివేదికలు తిరుగుతుండగా.. అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


హార్మోన్ల లోపంతో సతమతం


ఎప్‌స్టీన్ వైద్య రికార్డుల ప్రకారం.. అతను చాలా కాలంగా తీవ్రమైన హార్మోన్ల లోపంతో బాధ పడుతున్నాడు. సాధారణంగా ఒక పురుషుడిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉండాల్సిన దానికంటే జెఫ్రీ ఎప్‌స్టీన్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అమెరికన్ యూరోలాజికల్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం.. 300 ng/dL ఉండాల్సి ఉండగా ఎప్‌స్టీన్ రక్త పరీక్షల్లో అవి కేవలం 125 నుంచి 142 ng/dL మధ్య మాత్రమే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సమస్య గత పదేళ్లుగా తనను వేధిస్తోందని ఎప్‌స్టీన్ స్వయంగా తన వైద్యులకు పంపిన ఈమెయిల్స్‌లో పేర్కొన్నాడు.


లైంగిక శక్తి కోసం ఆరాటం


శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడంతో తన లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే భయం ఎప్‌స్టీన్‌ను తరచుగా వెంటాడేది. 2015లో ఒక అర్ధరాత్రి తన వైద్యుడికి పంపిన ఈమెయిల్‌లో.. "ఈ హార్మోన్ లోపం ఇప్పుడు నన్ను పూర్తిగా చుట్టేసిందా?" అని ఆందోళన వ్యక్తం చేశాడు. దీని కోసం హార్మోన్ థెరపీని ప్రారంభించినప్పటికీ.. శరీరంలో నీరు చేరడం, బరువు పెరగడం వంటి దుష్ప్రభావాల వల్ల 2016లో ఆ చికిత్సను నిలిపివేశాడు. అయినప్పటికీ.. లైంగిక సామర్థ్యాన్ని పెంచే 'ఎన్‌హాన్స్‌మెంట్ పిల్స్' కోసం అతను నిరంతరం ఆరాటపడేవాడని, అలాంటి ఉత్పత్తుల కంపెనీల నుంచి అతనికి ప్రచార ఈమెయిల్స్ వచ్చేవి అని దర్యాప్తులో తేలింది.


గుట్టురట్టైన లైంగిక వ్యాధులు


కేవలం హార్మోన్ల లోపమే కాకుండా ఎప్‌స్టీన్ అనేక లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడినట్లు మెడికల్ ఫైల్స్ వెల్లడిస్తున్నాయి. 2016లో ఒక డాక్టర్‌కు రాసిన లేఖలో తనకు గనేరియా వంటి ఇన్ఫెక్షన్లు సోకాయని, వాటికి యాంటీ బయోటిక్స్ వాడుతున్నానని వివరించాడు. తన అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తన వల్ల అతను తరచూ ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడేవాడని పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.


వింత కోరికలు.. వీర్య నిల్వ!


ఈ నివేదికల్లో వెల్లడైన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎప్‌స్టీన్ తన వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలని భావించాడు. దీనికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని సేకరించడానికి అతను ఎంతగానో ప్రయత్నించినట్లు ఆధారాలు కూడా దొరికాయి. విలాసవంతమైన జీవితం గడుపుతూ.. చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసే నెట్‌వర్క్ నడుపుతున్న ఈ నిందితుడు.. తన వారసత్వం కోసం ఇంతటి జాగ్రత్తలు తీసుకోవడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa