ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలెంటైన్స్ వీక్ 2026.. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రత్యేకతలివే!

Life style |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 02:06 PM

ప్రేమికుల వారోత్సవాలు 2026 ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమై 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రతి రోజు ఓ ప్రత్యేకతను కలిగి ఉంది.. 7వ తేదీన రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9వ తేదీన చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12వ తేదీన హగ్ డే, 13న కిస్ డే, 14న వాలెంటైన్స్ డే జరుపుకోనున్నారు. గులాబీ రంగులు ప్రేమ, స్నేహం, కృతజ్ఞత, క్షమాపణలను సూచిస్తాయి. ఈ ఏడాది జంటలు ట్రిప్స్, కొత్త విషయాలు నేర్చుకోవడం, డిజిటల్ గిఫ్ట్స్ వంటి వినూత్న పద్ధతుల్లో జరుపుకుంటున్నారు. స్నేహితులు, సెల్ఫ్ లవ్ కూడా ఈ వేడుకల్లో భాగమయ్యాయి.


ఇప్పుడు జంటలు పాత పద్ధతుల కంటే భిన్నంగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. కేవలం వస్తువులే కాకుండా కలిసి ట్రిప్ వెళ్లడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నారు. ఫోటోలు ఉన్న ఫ్రేమ్‌లు, జ్ఞాపకాలతో కూడిన స్క్రాప్ బుక్స్ ఇస్తున్నారు. దూరంగా ఉండేవారు వీడియో కాల్స్, ఆన్‌లైన్ గిఫ్ట్స్ ద్వారా డిజిటల్ సప్రైజ్ చేస్తూ పలకరించుకుంటున్నారు. కేవలం ప్రేమికులే కాదు, స్నేహితులతో కలిసి లేదా సెల్ఫ్ లవ్ & ఫ్రెండ్ షిప్  సెలబ్రేట్ చేసుకునే ట్రెండ్ కూడా పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa