టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కొలంబోలో జరగనున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మ్యాచ్ రోజున 65 శాతం వర్షం పడే అవకాశం ఉంది. కనీసం 5 ఓవర్లు ఆడితేనే ఫలితం వస్తుంది, రిజర్వ్ డే లేదు. ఆట నిలిచిపోయి ఓవర్లు పూర్తి కాకపోతే రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. మ్యాచ్ రద్దయితే ప్రసార సంస్థలు, క్రికెట్ బోర్డు, అభిమానులు నష్టపోయేందుకు అవకాశం ఉంది.శ్రీలంక వాతావరణ శాఖ ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దాని ప్రభావంతో కొలంబోలో జల్లులు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రముఖ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం మ్యాచ్‌కు ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. మ్యాచ్ సమయంలో మేఘావృత వాతావరణం, సుమారు 27°C ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa