పోషకాహార నిపుణుల ప్రకారం, మటన్ కేవలం రుచికరమైన ఆహారమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేక కాళ్ళ సూప్ (పాయా) కొల్లాజెన్, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్లతో సమృద్ధిగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఎముకల బలానికి, కీళ్ల నొప్పుల నివారణకు దోహదపడుతుందని పేర్కొంటున్నారు. ఇక అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందట.పాయా కీళ్ల నొప్పులను తగ్గించి, ఎముకలను బలోపేతం చేయడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అనారోగ్యం తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తికి మేక కాళ్ళ సూప్..
బలహీనపడిన ఇమ్యూనిటీకి మేక కాళ్ళ సూప్ చాలా మంచిది. ఇది శరీర రక్షణ వ్యవస్థను సహజంగా బలోపేతం చేయడానికి అద్భుతమైన మార్గం. ఈ సూప్ శరీరానికి మంచి వెచ్చదనాన్ని అందించి, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అందుకే చాలామంది దీన్ని ఒక అద్భుతమైన ఇంటి చిట్కాగా వాడతారు.
జలుబు, ఎముకల నొప్పులకు మటన్ బోన్ సూప్..
ఎంతకీ తగ్గని దీర్ఘకాలిక జలుబు లేదా ఎముకల నొప్పులతో సతమతమవుతున్నారా? దీనికి మన పెద్దలు తరతరాలుగా సూచించిన నల్లి సూప్ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇది కేవలం జలుబును తగ్గించడమే కాదు.. ఫ్రాక్చర్ అయిన ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడుతుంది. అంతేకాకుండా, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎముకలకు అదనపు బలాన్ని ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa