భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, దేశీయంగా ఆ ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదు. పన్నుల భారం, రవాణా ఖర్చుల కారణంగా చమురు ధరలు స్థిరంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఈ అనిశ్చితి వల్ల వాహనదారులు విసిగిపోయి, ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు.
పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో భారతీయ ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పెట్రోల్ కొట్టించలేక సతమతమవుతున్న జనం ఇప్పుడు భారీగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ హితంతో పాటు, దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఈవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ రాయితీలు కూడా ఈ మార్పుకు ప్రధాన ఊతంగా నిలుస్తున్నాయి.
ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో చమురు ధరల వ్యత్యాసం ఆశ్చర్యకరంగా ఉంది. లిబియాలో లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2.15 వంటి నామమాత్రపు ధరకే లభిస్తుండగా, ఇరాన్, వెనిజులా, అంగోలా, కువైట్ వంటి దేశాల్లోనూ ధరలు అత్యల్పంగా ఉన్నాయి. వనరుల లభ్యత, ప్రభుత్వ సబ్సిడీల వల్ల ఆయా దేశాల్లో ఇంధనం నీళ్ల ధరకే దొరుకుతోంది. కానీ భారత్ వంటి దేశాల్లో దిగుమతులపై ఆధారపడటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతోంది.
ప్రస్తుతం అంతర్జాతీయ ఇంధన ధరల జాబితాను పరిశీలిస్తే, భారత్ 73వ స్థానంలో కొనసాగుతోంది. దిగుమతి సుంకాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వివిధ పన్నులు, డీలర్ కమీషన్లు అన్నీ కలిసి లీటర్ ధరను వందకు పైగా చేరుస్తున్నాయి. ఇంధన స్వయం సమృద్ధి సాధించే వరకు లేదా పన్నుల వ్యవస్థలో మార్పులు వచ్చే వరకు సామాన్యుడికి ఈ భారం తప్పేలా లేదు. అందుకే రవాణా రంగంలో ఇప్పుడు 'విద్యుత్' విప్లవం వేగవంతం అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa