ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి పరిధిలో కోర్ట్ కాంప్లెక్స్ కి భూమి పూజ చేసిన జస్టిస్ సూర్యకాంత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 03:13 PM

తిరుపతి రూరల్ దామినీడులో 120 కోట్ల రూపాయలతో 14.44 సెంట్ల భూమిపై 16 కోర్టు భవన సముదాయాని భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల ఆలయానికి సమానమైన ఆలయం మరొకటి లేదని కోట్లాది మంది భక్తులు భావిస్తారు. అలాగే, తిరుపతిలో నిర్మిస్తున్న కోర్ట్ కాంప్లెక్స్ కూడా న్యాయం అందించటంలో మరో ‘ఆలయం’ కావాలన్నారు. ఏపీలోని విజనరీ ప్రభుత్వం రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన విధంగా కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయం అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.న్యాయం అందించడంలో టైంలైన్ అవసరమని చెప్పారు. బెంచ్, బార్ వేరు వేరు కాదని, బార్ నుంచి వాదన సరిగ్గా ఉన్నప్పుడే జడ్జిల నుంచి నాణ్యమైన తీర్పులు ఉంటాయని చెప్పారు. నాణ్యమైన తీర్పులు వచ్చినప్పుడు, ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. చెల్లెల్లు, కుమార్తెలైన మహిళా న్యాయవాదులకు మంచి సౌకర్యాలు కోర్ట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయాలని చెప్పారు. మెడికల్ సెంటర్ కూడా కాంప్లెక్స్‌లో ఉండేలా చేయాలన్నారు. అప్పుడే వయసులో పెద్దవారైన వారు కోర్టు కాంప్లెక్స్‌లో ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాణహాని భయం ఉండదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa