మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రి ధ్వంసమైంది. దీంతో వైద్యులు, సిబ్బంది, రోగులను ఖాళీ చేయించారు. ఈ దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందిస్తూ, ఆస్పత్రులపై దాడులు ఆందోళనకరమని, వాటిని నిరోధించాలని సూచించారు. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గాంధీ ఆస్పత్రితో పాటు మరో మూడు ఆస్పత్రులపై దాడులు జరిగినట్లు తెలిపారు. గతంలోనూ ఈ ఆస్పత్రిపై దాడులు జరిగాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం అణు, సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa