చంద్రబాబు నాయుడు తాను చెప్పుకున్నట్టు నిజంగా శ్రీవారి భక్తుడే అయితే అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ నాయుడిని తక్షణం టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడని చెప్పినా చంద్రబాబు నియమించాడని, ఏడాదిన్నరగా కొండపై ఆలయ పవిత్రతను మంటగలిపే కార్యక్రమాలు చేస్తున్నాడని ఆధారాలతో సహా బయటపెడుతున్నా చూస్తూ ఊరుకున్నాడని చెప్పారు. చివరికి బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చిన మరుక్షణమే ఆయనతో రాజీనామా చేయించకుండా డీప్ ఫేక్ వీడియో పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేయించి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని భూమన మండిపడ్డారు. ఈ వీడియో చూసి హిందూ సమాజం మొత్తం ఒక్కసారిగా నిర్ఘాంతపోయిందని, సోషల్ మీడియాలో శ్రీవారి భక్తులు దుమ్మెత్తి పోస్తున్నా చంద్రబాబు ఆయన్ను కాపాడాని చూడటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం దక్కితే అదృష్టంగా భావించకుండా ఆలయంలో రాజకీయాలు చేస్తూ వైయస్ జగన్ ని రాజకీయంగా లేకుండా చేయాలని బీఆర్ నాయుడు కుట్రలు చేశాడని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన సతీమణిపై కూడా నిందలు మోపి వారిని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించాలని చూసిన కుట్రలకు ఆ దేవదేవుడే ఈ కఠిన శిక్ష వేశాడని విశ్లేషించారు. ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ద్వారా లబ్ధిపొందాలనుకునే వారు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa