ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నూతన నిబంధనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:11 PM

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొత్త, కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. క్రమశిక్షణ, సమయపాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు తప్పనిసరిగా చేరుకోవాలని స్పష్టం చేసింది. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే దానిని 'లేట్ ఇన్‌'గా పరిగణిస్తారు.కొత్త నిబంధనల ప్రకారం నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (వెసులుబాటు సమయం) ఉంటుంది. ఇక హాఫ్-డే సెలవు తీసుకునే వారికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం విధులకు హాజరయ్యేవారు ఒంటి గంట లోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే 'లేట్ ఇన్‌'గా లెక్కిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టేవారు 12:30 గంటల కంటే ముందు 'ఔట్ టైమ్' నమోదు చేయకూడదు.పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైమ్ నమోదు చేసినా, ఉన్నత పాఠశాలల టీచర్లు సాయంత్రం 4 గంటల కంటే ముందు నమోదు చేసినా దానిని 'ఎర్లీ ఔట్'గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదయం ఇన్-టైమ్ నమోదు చేసి, సాయంత్రం ఔట్-టైమ్ నమోదు చేయడం మరిచిపోతే, వారు ఆ రోజంతా గైర్హాజరైనట్లే లెక్క. అంటే ఉదయం వచ్చిన వెంటనే వెళ్లిపోయినట్లుగా భావిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa