మన దేశంలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం ముగిసింది. సాయంత్రం 6.47కు గ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణాన్ని 6.20 నుంచి గ్రహణం ముగిసే వరకు వీక్షించారు. ఇక మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు.. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, కాలిఫోర్నియా సంపూర్ణచంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa