ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సేవింగ్స్, శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఝలక్.. ఛార్జీలు పెంచిన బ్యాంక్.. రూ.25 వేలు దాటితే బాదుడే

business |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 10:30 PM

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు వర్తించే పలు రకాల ఛార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది. కొత్త మార్పుల్లో ఈసీఎస్, ఎన్ఏసీహెచ్ ఫెల్యూయర్ ఫీజు, డెబిట్ కార్డ్ యాన్యూవల్ ఛార్జీలు, నెలవారీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ వంటివి ఉన్నాయి. అలాగే కొత్తగా థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీ సైతం తీసుకొస్తోంది. ఇకపై రూ.25000 పరిమితి దాటితే ఛార్జీల బాదుడు ఉంటుందని తెలుస్తోంది. మరి ఏ ఛార్జీలు ఎంత మేర ఉంటాయి అనేది తెలుసుకుందాం.


ఈసీఎస్/ఎన్ఏసీహెచ్ ఫెల్యూయర్ ఫీ


కోటక్ మహీంద్రా బ్యాంకులో ఏప్రిల్ 1, 2026 నుంచి ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ECS), నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ఫెల్యూయర్ ఛార్జీలు పెరిగాయి. తొలిసారి విఫలమయితే రూ.500 ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు రూ.550 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇది అన్ని రకాల సేవింగ్స్, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ ఛార్జీలు అన్ని ట్రాన్సాక్షన్లకు రూ.500గానే ఉండగా ఈసారి పెంచారు.


డెబిట్ కార్డ్ ఛార్జీలు


కోటక్ బ్యాంక్ పే షాప్ మోర్ డెబిట్ కార్డుపై ప్రతి సంవత్సరం రూ.285 ఛార్జ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఛార్జీలు రూ.259గా ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు మాత్రమే పలు సవరణలు చేసింది. ప్రీవీ, ప్రీవీ ప్లస్, నియాన్, ప్లాటినం, మాక్సిమా, బ్లాక్, సొలిటయిర్ కేటగిరీలో లేని కస్టమర్లకు నెలకు 3 ట్రాన్సాక్షన్లు మాత్రమే ఫ్రీగా ఉంటాయి. నెల మొత్తం రూ.1,00,000 వరకే విత్ డ్రా చేయొచ్చు. ఈ లిమిట్ దాటితే ఛార్జీలు వర్తిస్తాయి.


థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీ


కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్తగా థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీ అమలులోకి తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు నెలకు రూ.25000 వరకు పరిమితి ఉంటుంది. అంటే రూ.25 వేల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ, ఈ లిమిట్ దాటితే ఛార్జీల బాదుడు మొదలవుతుంది. ప్రతి రూ.1000 ట్రాన్సాక్షన్‌కి రూ.5 చొప్పున వసూలు చేస్తారు. ఒక ట్రాన్సాక్షన్‌కు కనీస ఛార్జీ రూ.150గా పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa