అమెరికా ఇరాన్‌పై మరింత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం బీ2 స్టీల్త్ బాంబర్లను సిద్ధం చేస్తోంది. బ్రిటన్‌లోని డీగో గార్సియా, ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్‌లను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రణాళిక వేసింది. ఈ బాంబర్లను ఆ స్థావరాలకు తరలిస్తున్నారు. బీ2 బాంబర్ల ఖరీదు సుమారు రెండు బిలియన్ డాలర్లు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం అమెరికాకు ఈ ఎయిర్ బేస్‌లను వాడుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 28న చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా బీ2 బాంబర్లు టెహ్రాన్‌పై దాడి చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa