ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ పాస్ ఉంటేనే అనుమతి,,,ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:56 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లే.. దివ్యాంగులకు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇంద్ర ధనస్సు పేరుతో పథకాన్ని ఈ నెల 18న ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల్ని ఉచిత ప్రయాణం కోసం ఎలాంటి పత్రాలను పరిగణలోకి తీసుకుంటారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 50శాతం రాయితీ కల్పిస్తుండగా.. ఆర్టీసీ బస్ డిపోల్లో పాస్‌లు జారీ చేసి వాటిని పరిగణలోకి తీసుకుని 50శాతం రాయితీ ఇచ్చారు.


దివ్యాంగులకు 50శాతం రాయితీ ఇచ్చేందుకు పాస్‌లను పరిగణలోకి తీసుకున్నట్లే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కోసం కొత్త పాస్‌లు జారీచేస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇప్పటికే ఉన్న పాస్‌లను పరిగణనలోకి తీసుకుంటారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఆర్టీసీ అధికారులకు పూర్తిస్థాయిలో ఆదేశాలు రాలేదు. అయితే ఇప్పటి వరకు పాస్ తీసుకోని దివ్యాంగులు.. కొత్తగా పాస్ తీసుకోవాలంటే సదరం సర్టిఫికెట్‌ను తీసుకెళ్లి ఆర్టీసీ డిపోలో దరఖాస్తు చేసుకుంటే కొత్త పాస్ ఇస్తారు. ఈ అంశంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని.. క్లియర్‌గా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి.. దివ్యాంగులకు జారీచేసిన పాస్‌లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.


ఏపీ ప్రభుత్వం ఇంద్ర ధనస్సు పేరుతో దివ్యాంగులకుఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచిత ప్రయాణానికి అర్హులు. స్త్రీ శక్తి పథకంలాగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగుల సహాయకుడికి కూడా రాయితీ ప్రకటించింది. దివ్యాంగులకు ఎస్కార్ట్‌‌గా వచ్చేవారికి ఏకంగా టికెట్‌ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుంది. దివ్యాంగుల వెంట వచ్చే ఆ సహాయకుడికి ఐదు రకాల బస్సుల్లో టికెట్‌లో 50శాతం రాయితీ ఇస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa