బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ రాంబార్కి శరత్ బాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశాల మేరకు పలు వార్డుల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చెలికాని మురళీకృష్ణ, పలువురు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa