ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని గ్రామాలను త్వరలోనే అభివృద్ధి చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 05:04 PM

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయో, గ్రామాల్లో కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ వ్యవస్థ, ఎల్‌ఈడీ వీధి దీపాలు, నాణ్యమైన సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతామని... పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో సుమారు 30,000 మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa