RCB IPL Live Score Update: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓపెనర్లు జోరుగా ప్రారంభించారు.కానీ చెన్నై బౌలర్లు ప్రాబల్యం చూపడంతో, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాడు.కోహ్లీ అవుట్ – చెన్నైకు ఊరట.ముందుగా శివమ్ దూబే చేతిలో క్యాచ్ తప్పిపోయిన విరాట్ కోహ్లీ (28), ఆ అవకాశాన్ని పెద్ద స్కోరుగా మార్చలేకపోయాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం దక్కింది. మరోవైపు అద్భుతంగా ఆడుతున్న ఫిలిప్ సాల్ట్ (46) కూడా అర్థ సెంచరీ దగ్గరగా చేరినప్పటి శివమ్ దూబే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.రెండు కీలక వికెట్లు పడినా, ఆర్సీబీ రన్ రేట్ తగ్గలేదు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చి జట్టుకు సమతౌల్యంగా రన్‌లు అందిస్తున్నారు. పడిక్కల్ కేవలం 22 బంతుల్లో 35 పరుగులు చేసి స్థిరంగా క్రీజులో ఉన్నాడు, అలాగే పాటిదార్ సిక్సర్లతో చెలరేగుతున్నారు.ప్రస్తుతం ఆర్సీబీ 12.4 ఓవర్లలో 129/2 చేసింది. ఈ జోరు కొనసాగితే, 200 పరుగుల మైలురాయిని సులభంగా దాటే అవకాశం ఉంది. చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ తన స్పెల్‌తో ఈ జోడీని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa