IPL 2026 ప్రారంభమైనప్పటి నుంచి Chennai Super Kings జట్టు కష్టాల్లోనే ఉంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన ఈ టీమ్, లీగ్ దశలోనే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఇక ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ విజయం సాధించడం తప్పనిసరి పరిస్థితిగా మారింది.ఇలాంటి సమయంలో జట్టు ఐకాన్, మాజీ కెప్టెన్ MS Dhoni గాయం సీఎస్కేకు మరింత సమస్యగా మారింది. కాలి గాయంతో బాధపడుతున్న ధోనీ ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. ఫ్రాంచైజీ సమాచారం ప్రకారం, మొదటి రెండు వారాలు ఆయన మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంటే కనీసం మూడు మ్యాచ్‌లను మిస్ అవుతారు. నాలుగో మ్యాచ్‌కైనా అందుబాటులో ఉంటారా అన్నది ఇంకా అనిశ్చితంగా ఉంది.Cricbuzz నివేదికల ప్రకారం, ధోనీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫిట్నెస్ సాధించడానికి ఇంకా సమయం అవసరమని తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ, మ్యాచ్ ఫిట్‌నెస్‌కు చేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.సమాచారం ప్రకారం, ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో వారం పట్టవచ్చు. దీంతో ఏప్రిల్ 11, 2026న MA Chidambaram Stadiumలో Delhi Capitalsతో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశం తక్కువగా ఉంది. అలాగే, ఏప్రిల్ 14న Kolkata Knight Ridersతో జరిగే మ్యాచ్‌కూ ఆయన దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ధోనీ గైర్హాజరీ సీఎస్కే ప్రదర్శనపై స్పష్టంగా ప్రభావం చూపుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఈ సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించి, ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. జట్టుకు ధోనీ అనుభవం, కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం చాలా అవసరం.ఇక యువ ఆటగాడు Dewald Brevis కూడా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే అతను కోలుకుంటున్నట్లు సమాచారం. తదుపరి మ్యాచ్‌లో జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa