ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టూ ఎదుర్కొనకూడని చెత్త రికార్డు ‘49 పరుగులు’. 2017లో Royal Challengers Bangalore జట్టు Kolkata Knight Riders చేతిలో నమోదైన ఈ అత్యల్ప స్కోరు ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో చెడు గుర్తుగానే మిగిలింది.ఈ నేపథ్యంలో, ఈ రోజు Delhi Capitalsతో జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డు మారుతుందేమో అన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని Arun Jaitley Stadiumలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించి, పవర్‌ప్లే ముగిసేలోపే ఆరు వికెట్లు పడగొట్టి ఢిల్లీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఒక దశలో స్కోరు చూస్తే ఢిల్లీ 49 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందనిపించడంతో, ఆర్సీబీ అభిమానులు తమ జట్టుపై ఉన్న చెత్త రికార్డు తొలగిపోతుందనే ఆశతో ఎదురుచూశారు.అయితే, డేవిడ్ మిల్లర్ మరియు అభిషేక్ పోరెల్ జట్టు ఇన్నింగ్స్‌ను కొంతసేపు నిలబెట్టారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో ఢిల్లీ 50 పరుగుల మార్క్‌ను దాటింది. దీంతో ఢిల్లీ అభిమానులు సోషల్ మీడియాలో “హమ్మయ్య.. 49 దాటేశాం” అంటూ ఊపిరి పీల్చుకున్నారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైన వేళ, పోరెల్ (21 బంతుల్లో 19), మిల్లర్ (18 బంతుల్లో 19) విలువైన పరుగులు జోడించి జట్టును అత్యల్ప స్కోరు అవమానం నుంచి బయటపడ్డారు. 11 ఓవర్ల ముగిసే సరికి ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 58 పరుగులతో కొనసాగుతోంది.ఈ పరిణామం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. “రికార్డు మారే అవకాశం మిస్ అయింది” అంటూ ఆర్సీబీ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తుంటే, “వికెట్లు పడినా పర్లేదు కానీ 49 మాత్రం మాకొద్దు” అంటూ ఢిల్లీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా మ్యాచ్ పరిస్థితి ఇంకా ఢిల్లీకి అనుకూలంగా లేకపోయినా, కనీసం ఆ చెత్త రికార్డు నుంచి మాత్రం జట్టు తాత్కాలికంగా బయటపడింది. మరోవైపు, ఆర్సీబీ బౌలింగ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా, మ్యాచ్‌పై వారి పట్టు బలంగా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa