వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అంతా బాగుందని అనుకోవడానికి వీలు లేదని.. నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు కాకపోయినా జగన్ చుట్టూ ఉన్నవారే తిరగబడతారని ఉండవల్లి హెచ్చరించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని కేవలం ఎమ్మెల్యేలే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేశారని ఉండవల్లి గుర్తుచేశారు. చంద్రబాబు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారా అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa