మంగళవారం ఉదయం తైవాన్ లోని ఇలాన్ ప్రాంతంలో 140 మీటర్లు పొడవున్న ఒక బ్రిడ్జి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది.వెంటనే స్పందించిన అధికారులు,రెస్క్యూ టీమ్,అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆ వంతెన క్రింద ఉన్న పడవల పై కూలిపోయింది.ఈ ప్రమాదంలో 10 మంది వరకు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.గాయపడ్డ వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు తెలిపారు.బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలేమిటనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa